Breaking News

బీజేపీలో సస్పెన్స్‌.. బ్రిజ్ భూషణ్‌కు టికెట్‌ దక్కేనా?

Published on Wed, 04/17/2024 - 08:12

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు  మొదటి దశ పోలీంగ్‌ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉ‍న్న ఉత్తరప్రదేశ్‌లో  రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్, రాయ్‌బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్‌ జరగనుంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ మే 3.

కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీ..
మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ  కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీనియర్‌ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే  ఆమె ప్రస్తుతం రాజాస్తాన్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్‌ నేత మనీష్ హిందవి తెలిపారు. 

బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు..
కైసర్‌గంజ్ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్‌గంజ్ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం​. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌భూషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు బ్రిజ్‌భూషన్‌ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన  ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. 

ఎస్పీలో సందిగ్ధం..
‘కైసర్‌గంజ్‌ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం.  ఇ‍క్కడ ఎవరిని నిలబెట్టినా  పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.  అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం  నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్‌ వర్ష యాదవ్‌ తెలిపారు. మరోవైపు..  ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

కైసర్‌గంజ్‌ టికెట్‌ బ్రిజ్ భూషణ్‌కు దక్కేనా..?
బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్‌ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్‌ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్‌భూషన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్‌లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్‌సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్‌లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్‌ నిరాకరించే  అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చ​ర్చించుకుంటున్నాయి.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)