Breaking News

ప్రధాని మోదీతో సీఎం నితీష్‌ భేటీ.. బీహార్‌లో ఏం జరగనుంది?

Published on Mon, 06/03/2024 - 12:55

దేశంలో లోక్‌సభ ఎన్నికల తంతు పూర్తయ్యింది. ఇక ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలివుంది. ఈ నేపధ్యంలో దేశంలో పలు ఆసక్తిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.

ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు జరిగిన ఈ భేటీలో బీహార్‌ రాజకీయాలతో పాటు ఇతర ప్రాంతాల రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు  హోంమంత్రి అమిత్‌షాతో నితీష్‌ కుమార్‌ సమావేశం కానున్నారు.

ప్రధానితో సీఎం నితీశ్ కుమార్ భేటీ వెనుక అనేక అంశాలు ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. బీహార్ సహా దేశవ్యాప్తంగా ఎన్డీఏ సీట్లను అంచనా వేయడం, నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక  క్యాబినెట్‌లో జేడీయూ పాత్ర ఎలా ఉండనుంది? భవిష్యత్తులో రెండు ప్రభుత్వాలు కలిసి ఎలా పని చేయాలి? అనే అంశాలపై వీరిమధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ నుంచి పాట్నాకు తిరిగి వెళ్లనున్నారు.  సీఎం నితీశ్‌ కుమార్‌ ఢిల్లీ పర్యటనలో ఆయన వెంట జేడీయూ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ ఝా కూడా ఉన్నారు. రేపు (శనివారం) లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)