Breaking News

అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్

Published on Sun, 01/28/2024 - 11:54

పాట్నా: మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవని.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

ఏడాదిన్నరగా మహా కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్ళలేక పోయిందని నితీష్ కుమార్ అన్నారు. గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో వెళ్లాలని అనుకుంటున్నామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నితీష్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. బీజేపీతో చేతులు కలిపి నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అటు.. బీజేపీ ఇటు జేడీయూలు తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. 

బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్‌ అవామీ లీగ్‌ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్‌ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం.

ఇదీ చదవండి: Bihar political crisis: ఇలా రాజీనామా, అలా ప్రమాణం!

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు