Breaking News

‘అభయ హస్తం’పై తొలి సంతకం

Published on Fri, 12/08/2023 - 02:25

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రేవంత్‌రెడ్డి ‘అభయ హస్తం’ ఫైలుపై తొలి సంతకం చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీల హామీల అమలును సుగమం చేసేలా దానిని రూపొందించారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగురాలు రజనికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాలను సీఎస్‌ శాంతికుమారితో కలసి రేవంత్‌రెడ్డి అందజేశారు. 

మాట నిలబెట్టుకున్న సీఎం: హైదరాబాద్‌లోని న్యూ బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి కుమార్తె రజని. అక్టోబర్‌ 17న గాందీ భవన్‌కు వచ్చిన ఆమె.. తన వైకల్యం వల్ల ఉద్యో గం దొరకడం లేదని, ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న రేవంత్‌.. అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారు.

గురువారం రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. రజనిని వేదికపైకి ఆహ్వనించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఆమెకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా నెలకు రూ.50వేల వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చారు. మాటను నిలబెట్టుకున్నారంటూ సీఎం రేవంత్‌కు రజని, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)