Breaking News

ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్‌ పవార్‌

Published on Mon, 07/17/2023 - 10:47

అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని రెబల్‌ గ్రూప్‌ ఎమ్మెల్యేలు.. ఆశ్చర్యకరరీతిలో ఎస్పీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ను కలిసి ఆశ్వీర్వాదం తీసుకోవడంతో మహా రాజకీయాలు మరేదైనా మలుపు తిరుగుతాయా? అనే ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. ఈలోపు ఆ సస్పెన్స్‌కు తెర దించారు శరద్‌ పవార్‌. 

ఎట్టి పరిస్థితుల్లో తాను బీజేపీకి మద్దతు ఇవ్వబోనని.. ప్రగతిశీల రాజకీయాలే తమ ఎజెండా అని స్పష్టం చేశారాయన. ఈ మేరకు ముంబై వైబీ చవన్‌ సెంటర్‌లో జరిగిన ఎన్సీపీ యువ కార్యకర్తల సమావేశాల ఆయన ఈ ప్రకటన చేశారు. 

జులై 2వ తేదీన షిండే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వానికి అనూహ్యంగా మద్దతు ప్రకటించి.. ఎన్సీపీ సంక్షోభానికి తెర తీసింది అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని రెబల్‌ గ్రూప్‌. అప్పటి నుంచి శరద్‌ పవార్‌ ఎన్సీపీ వర్సెస్‌ అజిత్‌ పవార్‌ ఎన్సీపీగా మాటల యుద్ధం నడుస్తోంది.

ఈ క్రమంలో.. సంక్షోభం మొదలైన రెండువారాల తర్వాత హఠాత్తుగా ఆదివారం రెబల్‌ గ్రూప్‌, శరద్‌పవార్‌ను కలిసింది. చాలాసేపు భేటీ తర్వాత తాము పవార్‌ ఆశీస్సుల కోసం వచ్చామని.. జరిగింది మరిచిపోయి తమతో పొత్తు దిశగా అడుగువేయమని కోరామని రెబల్‌ గ్రూప్‌ మీడియాకు వివరించింది. అయితే ఆ భేటీలో తన స్పందన తెలపని శరద్‌ పవార్‌.. ఆ తర్వాత యువ కార్యకర్తల సమావేశంలో మాత్రం తన అభిప్రాయాన్ని ఖుల్లాగా వ్యక్తం చేశారు. 

విపక్ష సమావేశానికి గైర్హాజరు
ఇదిలా ఉంటే.. బెంగళూరు వేదికగా జరగబోయే విపక్షాల సమావేశానికి ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పవార్‌ స్థానంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సూలే హజరు కానున్నారు. అయితే రెండవ రోజు అంటే రేపు మంగళవారం జరగబోయే భేటీకి మాత్రం పవార్‌ హాజరు కావొచ్చని తెలుస్తోంది.  2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 24 పార్టీలు ఈ కూటమి భేటీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)