Breaking News

ప్రధాని మోదీకి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కౌంటర్‌

Published on Sun, 05/12/2024 - 11:37

భువనేశ్వర్‌: ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎవరి సాయం లేకుండా  ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరు? అని మోదీ చేసిన వ్యాఖ్యలపై నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు.

‘‘ప్రధాని మోదీ గారు.. ఒడిశా గురించి మీకు ఎంతమేరకు గుర్తుంది. ఒడియా ఒక శాస్త్రీయ భాష. దానిని మీరు మర్చిపోయారు. సంస్కృతం కోసం బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించారు.. కానీ, ఒడియాకు కేటాయింపులు శూన్యం. నేను శాస్త్రీయ ఒడిస్సీ సంగీత గుర్తింపు కోసం ప్రతిపాదలు పంపాను.కానీ, వాటిని మీరు రెండు సార్లు తిరస్కరించారు.

 ఒడిశాలో అధికంగా లభించే సహజ వనరు బొగ్గు. కేంద్రం బొగ్గును ఒడిశా నుంచి తీసుకుంటోంది. కానీ, గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ రాయల్టీ పెంచలేదు. మోదీకి ఎన్నికల సమయంలో మాత్రమే ఒడిశా గుర్తుకు వస్తుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు(మోదీ) ఇచ్చిన హామీలను ఒడిశా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ధరలు తగ్గిస్తాం. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ ధరలు తగ్గిస్తాం వంటి హామీలను ఒడిశా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. 

అదే విధంగా ఒడిశాలోని మహానీయులను మోదీ ఎందుకు మర్చిపోయారు. వారికి భారత రత్న వంటి అవార్డులను ఎందుకు ఇవ్వలేకపోయారు. మరో పదేళ్లపాటు బీజేపీ ఒడిశా ప్రజలను మనసులకు గెల్చుకోలేదు’అని సీఎం నవీన్‌ పట్నాయక్‌ విమర్శలు చేస్తూ వీడియో విడుదల చేశారు.

..ఒడిశాలో ఆదివారం  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ సీఎం నవీన్‌ పట్నాయక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు‘‘ ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్‌ పట్నాయక్‌కు ఇదే నా సవాల్‌. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్‌లో చూడకూండా, ఎవరి సాయం లేకుండా  ఒడియా భాషలో చెప్పగలరా? పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను  ఎలా అర్థం చేసుకోగలరు?’’ అని మండిపడ్డారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)