Breaking News

J&K Assembly Polls: స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. ఎన్సీతో పొత్తు

Published on Thu, 08/22/2024 - 15:45

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో  కాంగ్రెస్‌ ఫోకస్‌ పెంచింది. ఎలాగైనా బీజేపీని అడ్డుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీ  ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్‌ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పొత్తు, సీట్ల షేరింగ్‌పై కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయంపై నేనషల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టతనిచ్చాడు. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్నట్లు వెల్లడించారు. పొత్తుతో ఎన్నికలకు వెళ్లేందుకు రెండు పార్టీలు అంగీకరించాయని, ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

కాగా  జమ్ముకశ్మీర్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నిన్న పర్యటించారు.  శ్రీనగర్‌లో పార్టీ శ్రేణులతో వీరు సమావేశం అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతలోనూ సమావేశమై పొత్తుల విషయాలు చర్చించారు. 

అయితే  రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉండగా కాశ్మీర్ లోయలో 12 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయాలని చూస్తుండగా.. జమ్మూ డివిజన్‌లో ఎన్సీకి 12 సీట్లను ఆఫర్ చేసినట్లు సమాచారం

ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. జమ్మూలోని డివిజన్‌లోని రెండు లోక్‌సభ స్థానం, లఢక్‌లోని ఒకస్థానం నుంచి కాంగ్రెస్‌ పోటీ చేసింది. కశ్మీర్‌లోని మూడు స్థానాల నుంచి ఎన్సీ మూడు అభ్యర్ధులను నిలబెట్టింది. ఎన్సీ రెండు చోట్ల గెలుపొందగా.. కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో ఓటమి చెందింది

ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జమ్ముకశ్మీర్‌కు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.  90 స్థానాలున్న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్ము డివిజన్‌లో 43 స్థానాలు, కశ్మీర్‌ డివిజన్‌లో 47 సీట్లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1న.. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ విజయం సాధించాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది.

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!