Breaking News

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ 

Published on Fri, 01/27/2023 - 04:23

సాక్షి,అమరావతి/గంగాధరనెల్లూరు: ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలియని పవన్‌కళ్యాణ్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. బూతులు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్‌ పనిచేస్తున్నారన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును కాపుల కోసం ఏమి చేశారని పవన్‌ ఏనాడైనా అడిగారా అని ప్రశ్నిం­చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తెచ్చింది దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. దాని గడువు ముగిసిన వెంటనే జగన్‌ మరో 20ఏళ్లు పొడిగించారని దీనిపై పవన్‌ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. 

ఆ ఆర్హత పవన్‌కు లేదు: హనుమంత్‌ నాయక్‌  
ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం అమలుపై సదస్సు పెట్టే అర్హత పవన్‌ కళ్యాణ్‌కు లేదని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్‌ హనుమంత్‌ నాయక్‌ అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం బడ్జెట్‌ లో ఎస్టీల అభివృద్ధికి 2020–23లో రూ.6,822.65 కోట్లను కేటాయించిందని చెప్పారు. గిరిజనుల నిధులను దారి మళ్లించి గిరిజనుల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిన నాటి టీడీపీ ప్రభుత్వాన్ని పవన్‌ కళ్యాణ్‌ ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)