Breaking News

ఆత్మశాంతి చేస్తారా భువనేశ్వరీ!

Published on Wed, 12/20/2023 - 16:42

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజలకు రూ. 10 కోట్లు బాకీ పడ్డారు. అవును రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా కుటుంబాలకు ఆ డబ్బు ఇవ్వాల్సి ఉంది.. ఇస్తారా.. ఇవ్వరా ? ఎగ్గొడతారా చూడాలి. 

వాస్తవానికి స్కిల్ స్కామ్ కింద చంద్రబాబు అరెస్ట్ అయ్యాక దేశ్ కీ నేతా.. విజనరీ.. తెలుగువాళ్ళ ఆత్మగౌరవం.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెట్టిన చాణక్యుడు .. నిప్పుకు ప్రతిరూపం.. సత్యానికి ప్రతిరూపం అయిన తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆక్రోశిస్తూ సభలు సమావేశాలు పెట్టి సానుభూతి ప్రోగుచేయాలని చూశారు. ఊరకనే ఈవెంట్లు చేస్తే వర్కవుట్ కావడం లేదని నిజం గెలవాలి అంటూ అక్టోబర్ 25 నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టారు. వెళుతూ తన భర్త ఘనతను చెబుతూ కాస్త బాధపడుతూ.. అప్పుడప్పుడూ నవ్వుతూ ఏదో ఈవెంట్ నడిపించారు.

పనిలో పనిగా ఎల్లో మీడియాలో సైతం చంద్రబాబు అరెస్టును భరించలేక వందలాది మంది చనిపోతున్నారంటూ రోజూ వార్తలు వచ్చేవి. ఇంకా ఈ చావులని సైతం తమ మైలేజీ కోసం వాడుకోవాలని ప్లాన్ చేసిన టీడీపీ అలా మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షలు సాయం అన్నారు. కొన్ని కుటుంబాలకు మాత్రం ఇచ్చారు. ఫోటోలు దిగారు. ఈలోపు చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. అంతే ఠక్కున కరెంట్ పోగానే టీవీ ఆగిపోయినట్లు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ఆగిపోయింది. అదేంటో మరి మిగతా 300 పైగా కుటుంబాలకు పైసా ఇవ్వలేదు. కనీసం ఉచిత సానుభూతి కూడా పలకలేదు. హఠాత్తుగా బస్సుయాత్ర నిలిపివేశారు.

మరి మిగతా కుటుంబాలను ఆదుకునేది ఉందా లేదా? అంటే తన భర్తకు బెయిల్ రాగానే నిజం గెలిచినట్లా? బెయిల్ రాగానే రాష్ట్రంలో నిజం గెలిచిందా? మరి చంద్రబాబు అరెస్టు భరించలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను ఓదార్పు.. ఆదరువు అక్కర్లేదా.. మీరు మీకుటుంబం సంతోషంతో ఉంటే చాలా?. మరి ఎంతోమంది చనిపోయారు అని మీరే అన్నారు కదా.. మరి వాళ్ళను ఎందుకు ఆదుకోరూ అని అంటున్నారు. మీకు బెయిల్ వస్తే నిజం గెలిచినట్లా? మాకు శాంతి లేదా.. అని మరణించినవారి ఆత్మలు ఘోషపెడుతున్నాయి. ఆ డబ్బులేవో మా కుటుంబీకులకు ఇచ్చేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాయి.
-✒️ సిమ్మాదిరప్పన్న

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)