Breaking News

యూటీగా ముంబై.. కాంగ్రెస్‌ చీఫ్‌ సంచలన కామెంట్స్‌

Published on Tue, 09/12/2023 - 10:35

ముంబై: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ దేశంలో జమిలీ ఎన్నికలకు ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే, ప్రత్యేక సమావేశాలపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే సంచలన కామెంట్స్‌ చేశారు. పార్లమెంట్‌ సమావేశాల వెనుక పెద్ద ప్లాన్‌ ఉందని ఆయన తెలిపారు. 

యూటీగా ముంబై!
కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. హఠాత్తుగా పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని విభజించడంతో పాటు ముంబై నగరాన్ని మహారాష్ట్ర నుంచి విడగొట్టి, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేయాలనే ఎజెండాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలు, పార్లమెంట్‌ వ్యవహారాల కమిటీతో సహా ఏ పక్షంతో కూడా సంప్రదింపులు చేయకుండా మోదీ సర్కార్‌ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు.

అప్పుడెందుకు ప్రత్యేక సమావేశాల్లేవ్‌..
ఇదే సమయంలో కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. దేశంలో నోట్ల రద్దు, కోవిడ్‌-19 సంక్షోభం, మణిపూర్‌ హింసాకాండ వంటి అంశాలపై ప్రత్యేక సమావేశాలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై నగరానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉందన్నారు. అటువంటి నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టి, ఇక్కడి సంస్థలు, కార్యాలయాలను బీజేపీ సర్కార్‌ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలిస్తోందని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ కుట్రలో భాగంగా బాంబే స్టాక్‌ ఎక్సేంజీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీని తరలించాలనే ప్లాన్‌లో మోదీ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: భారత్‌లో నిపా వైరస్‌ కలకలం.. ఇద్దరు మృతి!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)