నాగబాబు రాక.. పిఠాపురంలో మళ్లీ ఉద్రిక్తత

Published on Sat, 04/05/2025 - 11:15

కాకినాడ, సాక్షి: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu) పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కాకరేపింది. వర్మ పేరిట ఆయనకు తెలుగు తమ్ముళ్లు మరోసారి షాక్‌ ఇచ్చారు. జై వర్మ(Jai Varma) నినాదాలతో నాగబాబుకు ఝలక్‌ ఇచ్చారు. ఈ క్రమంలో పసుపు జెండాలతో టీడీపీ బలప్రదర్శనకు దిగగా.. జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

పిఠాపురంలో తన సీటు త్యాగం చేసి మరీ పవన్‌ కల్యాణ్‌ను గెలిపించారని టీడీపీలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్పీఎస్ఎన్ వర్మ మీద సానుభూతి ఏర్పడింది. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు మండిపడుతున్నారు. 

పైగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయింది. దీని వెనక కూడా నాగబాబు కుట్ర ఉందనే అభిప్రాయం వాళ్లలో బలంగా ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న గొల్లప్రోలులోనూ అన్నాక్యాంటీన్‌ ప్రారంభ కార్యక్రమంలో రసాభాసా సృష్టించారు. తాజాగా కుమారపురంలోనూ వర్మకు మద్ధతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి: వర్మ అవుట్‌.. ఇక పిఠాపురం జమీందార్‌గా కొణిదెల నాగబాబు

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)