Breaking News

కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్‌ అయ్యా: మైనంపల్లి

Published on Mon, 09/25/2023 - 10:02

సాక్షి, హైదరాబాద్‌:  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీకి వెళ్లి.. కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలోనే ఆయన కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తెలియశారు. 

‘‘ఈనెల 27న సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నా. మల్కాజిగిరి, మెదక్ టికెట్ నాకు, నా కుమారుడికి, అలాగే.. మేడ్చల్ టికెట్ నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు ఇవ్వమని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరాను. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గాలికి పెద్ద వాళ్లు కొట్టుకుపోవడం ఖాయం అని మైనంపల్లి వ్యాఖ్యానించారు. 

మరోవైపు మైనంపల్లిని అఫీషియల్‌గా పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్‌ నేతలు క్యూ కట్టారు. అంజన్‌ కుమార్‌ యాదవ్‌, దామోదర రాజనరసింహ తదితరులు దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి చేరుకుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ మీట్‌లో పాల్గొని చర్చలు జరిపారు. 

ఇదిలా ఉంటే.. రెండ్రోజుల కిందట బీఆర్‌ఎస్‌కు  మైనంపల్లి రాజీనామా ప్రకటించారు. తనకు మల్కాజ్‌గిరి, తన కొడుక్కి మెదక్‌ సీట్ల ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. మైనంపల్లితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే మైనంపల్లితో కాంగ్రెస్‌ కీలక నేతలు దఫదఫాలుగా చర్చలు జరిపారు. చివరకు తండ్రీకొడుకులకు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

Videos

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు