Breaking News

‘నా రోజువారి సంపాదన రూ.50’.. వరద బాధితులతో కంగనా రనౌత్ ఆవేదన

Published on Thu, 09/18/2025 - 21:31

ధర్మస్థల: నా రోజువారి ఆదాయం కేవలం రూ.50 మాత్రమే. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాల్సి వస్తోంది. నా బాధను అర్థం చేసుకోండి," అంటూ బాలీవుడ్‌ క్వీన్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ మాన్సూన్‌ సీజన్‌లో కుండపోత వర్షాలు, క్లౌడ్‌బరస్ట్‌లు హిమాచల్‌ను అతలాకుతలం చేశాయి. జూన్ 20 నుంచి ప్రారంభమైన వర్షాల కారణంగా ఇప్పటివరకు 419 మంది మరణించారు. వీరిలో 237 మంది వరదలు, కొండచరియలు, నీటి ప్రవాహం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల జరిగిన క్లౌడ్‌బరస్ట్‌ దాటికి రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన మండి జిల్లాలో పర్యటించిన కంగనా, వరద బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో మనాలీలో ప్రారంభించిన ‘ది మౌంటెన్‌ స్టోరీ’ రెస్టారెంట్‌ వరదల కారణంగా పర్యాటకులు తగ్గిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది.
‘నిన్న నా రెస్టారెంట్‌ ఆదాయం కేవలం రూ.50 మాత్రమే. కానీ నెలకు రూ.15 లక్షల జీతాలు చెల్లించాలి. నా బాధను అర్థం చేసుకోండి. నేనూ హిమాచలీనే’ అని ఆమె అన్నారు.

సోలాంగ్‌, పల్చన్‌ ప్రాంతాల్లో పర్యటించిన కంగనాకు స్థానికులు 15–16 ఇళ్లు ప్రమాదంలో ఉన్నాయని వివరించారు. బియాస్‌ నది కొండచరియలు విరిగిపడి గ్రామాలను ప్రమాదంలోకి నెట్టాయని చెప్పారు. అందుకే బియాస్‌ నది ప్రవాహాన్ని మళ్లించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు సూచించారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)