Breaking News

మహారాష్ట్రలో కూటమి సీట్ల పంపిణీ ఖరారు.. ఏ పార్టీకి ఎన్ని?

Published on Tue, 04/09/2024 - 13:50

ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎట్టకేలకు మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఇండియా కూటమి సీట్ల పంపిణీ ఒప్పందం కుందిరింది. ఈ మేరకు మంగళవారం మహావికాస్‌ఆఘాడీ నేతలు సంయుక్తంగా ప్రకటించారు. శివసేన(యూబీటీ) 21 సీట్లు, కాంగ్రెస్‌పార్టీ 17 సీట్లు, ఎన్సీపీ(శరద్‌ చంద్ర పవార్‌) 10 సీట్లతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు.

మొదటి నుంచి ఆశించిన సంగాలి లోక్‌సభ నియోజకవర్గాన్ని శివసేన(యూబీటీ) దక్కించుకోగా.. భీవండి స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంది. మరోవైపు శివసేన(యూబీటీ)కి పట్టు ఉన్న ముంబై నార్త్‌ స్థానాన్ని సీట్ల పంపిణీలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకోవటం గమనార్హం. సీట్ల పంపిణీ అనంతం శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడారు.

‘ప్రతిఒక్కరు అన్ని సీట్లలో గెలవడానికి తీవ్రంతా పోరాడాలి.  పోరాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా అన్ని సీట్లలో గెవడానే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి’ అని ఉద్ధవ్‌ అన్నారు. మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉ‍న్న మహారాష్ట్రలో ఏప్రిల్‌ 19 నుంచి ఐదు దశల్లో పోలింగ్‌ జరగనుంది. అయితే కొన్ని కీలకమైన సీట్ల విషయంలో మహా వికాస్‌ ఆఘాడీ కూటమి సీట్ల పంపకం కొంత జాప్యమైన విషయం తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)