Breaking News

ముంబై హిట్‌ అండ్‌ రన్‌ కేసు: ఒళ్లు గగుర్పొడిచేలా.. వెలుగులోకి సంచలన విషయాలు

Published on Tue, 07/09/2024 - 08:22

ముంబై : ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారు హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మిహిర్‌ షా బాధితురాలు కావేరీ నక్వాను కారు బానెట్‌పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

గత ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ముంబై వ్రోలి అనే ప్రాంతంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారు హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదైంది.  స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హిట్‌ అండ్‌ రన్‌ ఎలా జరిగిందో పోలీసులు కోర్టుకు వివరాలు అందించారు

ఈ కేసులో ప్రధాన నిందితుడైన శివసేన నేత రాజేష్‌ షా కుమారుడు మిహిర్‌ షా.. పూటుగా మద్యం సేవించి ఉదయం చేపల మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న కావేరీ నక్వా, పార్ధిక నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టాడు. బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్‌పై పడ్డారు. అలాగే కిలోమీటర్‌ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్‌ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు.  

స్థానికుల సమాచారం, బాధితురాలి భర్త ఫిర్యాదు, సీసీటీవీ పుటేజీ వీడియోల ఆధారంగా  ప్రమాదం తర్వాత మిహిర్ షా కారును వదిలేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.  తప్పించుకునేందుకు అక్కడి నుంచి మరో ప్రాంతానికి పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. మిషిర్‌ షా ప్రియురాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్ జుహూ ప్రాంతంలోని ఓ బారులో పీకల వరకు మద్యం సేవించినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్‌లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తేలింది.

ప్రమాద సమయంలో కారులో మిహిర్‌తో పాటు అతడి డ్రైవర్ కూడా ఉన్నాడు. బార్ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్ సీట్లోకి మారినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతుంది.  

కాగా,ఇదే కేసులో మిహిర్‌  మిషిర్‌ షా తండ్రి శివసేన నేత రాజేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు సోమవారం సాయంత్రం రాజేష్‌ షాకు కోర్టు బెయిల్‌ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్‌ బెయిల్‌ను మంజూరు చేసింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)