Breaking News

ములాయం సింగ్‌ యాదవ్‌ కుమారుడు ప్రతీక్ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 01/19/2026 - 14:49

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య అపర్ణ యాదవ్‌తో వేగలేక ఆమె నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.  

ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అపర్ణ చిత్రాన్ని పోస్ట్ చేసి.. ఆమెను ఫ్యామిలీ డిస్ట్రాయర్‌గా అభివర్ణించారు. ‘నా భార్య అపర్ణ యాదవ్‌ (బీజేపీ నేత)కు విడాకులు ఇస్తున్నాను. అపర్ణ యాదవ్‌ నా కుటుంబంలో చిచ్చు పెట్టింది. నా కుటుంబాన్ని నాశనం చేసింది.  

 ఇలా స్వార్థంగా ఆలోచించే మహిళ నుంచి వీలైనంత త్వరగా విడాకులు తీసుకుంటాను. ఆమె నా కుటుంబ సంబంధాలను నాశనం చేసింది. ఆమె ఫేమస్‌ అవ్వాలని, ఇతరులను ఇన్‌ఫ్లయిన్స్‌ చేయాలని కోరుకుంటుంది.  నాకు నా మానసిక స్థితిపై ఆందోళనగా ఉంది. అలా అని ఆమె నాకోసం బాధపడదు. తన కోసం తాను మాత్రమే బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు.  ఆమెను వివాహం చేసుకోవడం నా దురదృష్టం’ అని ప్రతీక్ అన్నారు.

 ప్రతీక్, అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు  వారికి ఒక కుమార్తె ఉంది. అయితే, అపర్ణ సోదరుడు అమన్ బిష్ట్ ..  ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు చెప్పారు.

 ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న అపర్ణ 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి  పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. 2022లో ఆమె జాతీయ వాదం కారణం చూపుతూ బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

అపర్ణ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌కు కోడలుగా రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరించారు. అయితే, ఆమె బీజేపీలో చేరిన తర్వాత యాదవ్ కుటుంబంలో అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు విడాకుల కేసు దాఖలు కావడంతో ఆ విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. యాదవ్ కుటుంబం  ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ విడాకుల కేసు ఆ కుటుంబ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)