తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి: ఎంపీ విజయసాయిరెడ్డి

Published on Thu, 06/22/2023 - 21:15

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు పార్టీ న్యాయ విభాగం క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్, అనుబంధ విభాగాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి సూచించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పంచాయతీ రాజ్, న్యాయ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్, పార్లమెంటరీ పోలింగ్ బూత్ ఇంచార్జిలతో వేర్వేరుగా ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొన్ని పత్రికలు మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నాయని, ప్రజల దృష్టిలో పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుంది.. న్యాయ పరంగా దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
చదవండి: ‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం

గతంలో మాదిరిగానే ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే పత్రాలు నుంచి ప్రతి విషయంలోనూ న్యాయ విభాగం సహాయ సహకారాలు అందించాలని కోరారు. వైఎస్సార్ లా నేస్తం పేరిట జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం నెలకు 5000 రూపాయలు స్టైపండ్ ఇస్తుందని, అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వివిధ విభాగాలకు సంబంధించి కమిటీల నియామకం త్వరగా పూర్తి చేయాలన్నారు. పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి నేతృత్వంలో న్యాయవిభాగ సమావేశం జరిగింది.
చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్‌సీపీ గెలుపు నల్లేరుపై నడకే..

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)