Breaking News

AP: మళ్లీ జగనే సీఎం: బస్సు యాత్రలో ఎంపీ నందిగాం

Published on Wed, 01/03/2024 - 18:16

అన్నమయ్య, సాక్షి: రైల్వేకోడూరు ప్రజల అనందం చూస్తుంటే ఎమ్మెల్యేగా శ్రీనివాసులు, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోందని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌ అన్నారు. రైల్వేకోడూరులో బుధవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ నందిగాం సురేష్‌బాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు. 

‘నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనకు పద్నాలుగున్నర నెలల చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉంది. చంద్రబాబు పాలనలో కుళ్లు కుతంత్రాలు తప్ప చేసిందేమీ  లేదు. బినామీలకు దోచిపెట్టారు. బాబు ఎవరికీ చేసిందేమీ లేదు. ఏమి చేశారం‍టే చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నుపోటు  గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. అదే వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేశారు.

ఎంత మంది ఏకమై వచ్చినా ఊడేదేమి లేదు. రాష్టానికి మేలు చేసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఏపీకి దశ దిశ చూపే వ్యక్తి సీఎం జగన్‌. కోడూరు అభివృద్దికి జగన్‌ అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీనివాసులు. మీరు మళ్లీ అవకాశమిస్తే మళ్లీ మంత్రి అవుతారు’అని ఎంపీ సురేష్‌ అన్నారు. 

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ..

‘రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నవ్వులోనే ఎవరికి ఏ కష్టమోచ్చినా అండగా నేను ఉన్నానన్న నమ్మకం కలుగుతుంది. యాదవులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ రాజకీయ సమానత్వం తీసుకువచ్చారు. చంద్రబాబు మాత్రం బడుగు బలహీన వర్గాల వారిని అవమానపరిచారు. ఇలాంటి సీఎంను, ఎమ్మెల్యే శ్రీనివాసులును మళ్లీ భారీ మోజార్టీతొ గెలిపించాలి’ అని రమేష్‌ యాదవ్‌ అన్నారు. 

ఇదీచదవండి.. కేశినేని నాని వర్సెస్‌ చిన్ని

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)