Breaking News

‘సమోసాకు డబ్బుల్లేక.. చాయ్‌తో సరిపెట్టారు’

Published on Thu, 12/21/2023 - 06:32

న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలపై ఓ వైపు చర్చ జరుగుతుంటే అక్కడ సమోసాలు ఇవ్వలేదంటూ జేడీ(యూ) సీనియర్‌ నేత సునీల్‌ కుమార్‌ పింటూ కాంగ్రెస్‌నుద్దేశిస్తూ చులకనగా మాట్లాడారు. డబ్బుల్లేక కాంగ్రెస్‌ కనీసం సమోసాలు కూడా వడ్డించలేదని వ్యాఖ్యానించారు.

‘‘ నిన్నటి సమావేశానికి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలంతా విచ్చేశారు. సీట్ల పంపకాలపై చర్చించాలనుకున్నా అది టీ, బిస్కెట్లకే పరిమితం అయింది. ఎందుకంటే కాంగ్రెస్‌ దగ్గర నిధులు నిండుకున్నాయి. రూ.138, రూ.1,380, రూ.13,800 ఇలా చిన్న చిన్న మొత్తాలను ఆ పార్టీ విరాళంగా సేకరిస్తోంది. ఇంకా విరాళాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా సమోసాలుండవు. టీ, బిస్కెట్లతో సరిపెట్టుకోవాలి. సమోసాలు లేకుండా ఎలాంటి తీవ్రమైన చర్చలు జరగబోవు’’ అని సునీల్‌ పింటూ వెటకారంగా అన్నారు. సంబంధిత వీడియోను బీజేపీ నేత అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు.
 

Video Credits:News18 Bihar


ఆయ్‌.. హిందీ తెలియాల్సిందే
విపక్షాల కూటమి సమావేశంలో నితీశ్‌ కుమార్‌ ప్రసంగిస్తుండగా డీఎంకే నేత టీఆర్‌ బాలు బాగా ఇబ్బంది పడ్డారు. హిందీరాని బాలుకు నితీశ్‌ హిందీ ప్రసంగం అర్ధంకాలేదు. అర్ధంచేసుకునేందుకు తన పక్కనే కూర్చున్న రా్రïÙ్టయ జనతాదళ్‌ రాజ్యసభ సభ్యుడు మనోజ్‌ ఝాను సాయంకోరారు. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్ధమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని నితీశ్‌ను ఝా కోరారు. దీంతో ఆగ్రహించిన నితీశ్‌.. ‘ హిందీ మన జాతీయ భాష. అందుకే మన దేశాన్ని హిందుస్తాన్‌గా పిలుచుకుంటాం. హిందీ అందరి భాష. అలాంటి హిందీ తెలియాల్సిందే. నేర్చుకుని అర్ధంచేసుకోవాలి. మీరు అనువాదాలు ఏవీ చేయకండి’’ అని ఝాను వారించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)