Breaking News

అధికారిక బంగ్లాలోకి రాహుల్ ఎంట్రీ.. కీలక వ్యాఖ్యలు..

Published on Tue, 08/08/2023 - 16:49

ఢిల్లీ: పార్లమెంటేరియన్‌గా మళ్లీ గుర్తింపు పొందిన తర్వాత ఢిల్లీలో అధికారిక నివాస భవనాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేటాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఇండియా అంతా నా ఇల్లే అని వ్యాఖ్యానించారు. 2019 నాటి మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసులో రాహల్ గాంధీకి పార్లమెంట్ సభ్యునిగా గుర్తింపు రద్దు అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కేటాయించిన అధికారిక భవనాన్ని ఖాలీ చేయాల్సి వచ్చింది. 

 రాహుల్ గాంధీకి ఇంతకు ముందు ఇచ్చిన తిలక్ లేన్‌లోని బంగ్లా 12నే మళ్లీ ఆయనకు అధికారిక నివాసంగా కేటాయిస్తూ లోక్‌సభ హౌసింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లు జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు తీర్పు అనంతరం ఆయన తన అధికారిక నివాసాన్ని  ఏప్రిల్‌లో ఖాలీ చేశారు. కానీ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన సందర్భంగా ఆయన తన పార్లమెంటరీ పదవికి మళ్లీ అర్హత సాధించారు. 

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత లోక్‌సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడడం వల్ల కోల్పోయిన లోక్‌సభ సభ్యత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగివచి్చంది. రాహుల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సమాచారం తెలిసిన అనంతరం రాహుల్‌ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తొలుత గాంధీజీ విగ్రహం వద్ద నివాళులరి్పంచి మధ్యాహ్నం ఎంపీగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు.

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్‌.. లోక్‌సభ స్పీకర్‌ కీలక నిర్ణయం


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)