Breaking News

‘వారిని సోషల్ బాయ్ కాట్ చేయాలి’

Published on Thu, 04/17/2025 - 17:25

హైదరాబాద్:  కేటీఆర్, హరీష్ రావు, కవితలను సోషల్ బాయ్ కాట్ చేయాలని అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.  14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని వీరు చేయలేదని, అందుచేత ఆ ముగ్గుర్ని సోషల్ బాయ్ కాట్ చేయాలని రఘునందన్ రావు సూచించారు. ఈరోజు(గురువారం) మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రఘునందన్ రావు.. ‘ కేటీఆర్, హరీష్ రావు, కవితలు 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనీ చేయలేదు. 

గతంలో కేంద్రం కొండా బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే తెల్లారే భూమి,  యునివర్సిటీ పేరు మారింది. కేసీఆర్ గవర్నమెంట్ రాగానే ఎందుకు HCU భూములు బదలాయించలేదు.2012 నాటి జిల్లా కలెక్టర్ CCLA కు రాసిన లేఖ ఆధారంగా బదలాయించాలి. ఆనాడు వారి అవసరాలకు అనుగుణంగా దాన్ని పక్కన పెట్టిన కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.  

ఎన్నో డాక్యుమెంట్స్ సేకరించి CEC సాధికారత కమిటీకి అందజేశా. సాధికారత కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు ముందు నన్ను వాదనలు వినిపిస్తారా అని అడిగారు. మేము రిఫర్ చేస్తాం వచ్చి వాదనలు వినిపించాలి అన్నారు. అవసరమైనప్పుడు పిలిస్తే వస్తా అని చెప్పా. HCU భూములు అంటూ ఆనాడు ప్రభుత్వం తెలుగులో రాసిన పంచనామా ఉంది. HCU భూములు కానప్పుడు ఆనాటి ప్రభుత్వం ఎందుకు పంచనామా చేసింది. గోపనపల్లిలో కేటాయించిన స్థలంలో వేర్వేరు సంస్థలు వచ్చాయి. ఇష్టారీతిన అమ్మాలని  ప్రభుత్వం చూసింది. HCU భూములపై ఫైట్ చేసింది బీజేపీ’ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)