ఉనికి కోసమే టీడీపీ గోబెల్స్‌ ప్రచారం: మోపిదేవి ఫైర్‌

Published on Fri, 07/28/2023 - 13:28

సాక్షి, ఢిల్లీ: టీడీపీ గోబెల్స్‌ ప్రచారానికి దిగుతోందని మండిపడ్డారు వైఎ​స్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాష్ట్రంలో ఉనికి కోసం టీడీపీ నేతలు నానా తిప్పలు పడుతున్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

కాగా, ఎంపీ మోపిదేవీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. 
యువగళం పేరుతో లోకేశ్‌ పెయిడ్ ఆర్టిస్టులను  తీసుకొస్తున్నారు. గత మే 16న అమర్నాథ్ అనే వ్యక్తి  హత్యలో రాజకీయ కారణాలు లేవు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలో వారిని కోర్టు ముందు నిలబెట్టాము. బాధిత కుటుంబానికి వెంటనే ఉద్యోగం ఇచ్చాం. 

అలాగే, వారికి ఇంటి స్థలం కూడా మంజూరు చేశాం. కానీ, ఇప్పుడు నారా లోకేశ్‌ బాబు.. అమర్నాథ్‌ తల్లి, చెల్లితో పచ్చి అబద్ధాలు చెప్పించారు. అభం శుభం తెలియని వారిని తమ స్వార్థం కోసం టీడీపీ ఉపయోగించుకుంటోంది. అమర్నాథ్‌ కుటుంబాన్ని మా ప్రభుత్వం సంపూర్ణంగా ఆదుకుంది. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తక్షణమే బాధితులకు అండగా నిలిచిందన్నారు. నాలుగేళ్లలో బీసీల కోసం ప్రభుత్వం రూ.82వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీసీలను అధికంగా రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్‌దే. బీసీల కోసం చరిత్రలోనే ఎవరూ చేయనంతగా రాజకీయంగా, సామాజికంగా సీఎం జగన్‌ చేయూతనిచ్చారు. 

మరోవైపు, వైఎస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో బీసీలకు ఒరిగిందేమీ లేదు. రేపల్లె ఘటనపై లోకేశ్‌ అబద్ధాలు మాట్లాడుతున్నారు. టీడీపీ నీచ రాజకీయాలను మానుకోవాలి. టీడీపీ మాయ మాటలను బీసీలెవరూ నమ్మరు. బీసీ రిజర్వేషన్‌ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా?

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)