Breaking News

ఏఐసీసీలో ఖర్గే ఓ బొమ్మ మాత్రమే: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

Published on Fri, 11/15/2024 - 18:29

సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్‌లో పాస్‌ అవుతుందని అన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వక్ఫ్ మతం కిందకు రాదని చెబుతున్నాయని,.  వక్ఫ్‌ అనేది ఇతర దేశాల్లో ప్రభుత్వం కిందనే ఉందని తెలిపారు. ఎవరడ్డుకున్నా వక్ఫ్ బోర్డు సవరణ జరుగుతుందని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకమని.. ఎవరైనా సర్వోన్నత న్యాయస్థాన తీర్పును గౌరవించాల్సిందేనని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. దీనికి సుప్రీంకోర్టుకు మించి అధికారలిచ్చారని విమర్శించారు.  ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొన్నారు.

‘300 వందల ఏళ్ల క్రితం కింద ఔరంగా జేబు నోటి మాటతో భూములిచ్చి ఉండొచ్చు,  కానీ నేడు కుప్పలువుకుప్పలుగా డాక్యుమెంట్స్‌తో భూములు మావని అంటున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం, నవ్వాలో, ఏడ్వాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. దేవాలయం అనేది మతానికి సంధించింది. వక్ఫ్ ఆనేది సమాజానికి సంబంధించినది.

ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశాన్నైనా అమ్ముకుంటాయి.  ఏఐసీసీలో ఖర్గే ఒక బొమ్మ మాత్రమే. నాడు మన్మోహన్ సింగ్‌ను ఎలా వాడుకున్నారో నేడు ఖర్గే  కూడా అలాగే వాడుకుంటున్నారు.రాహుల్ తాత నెహ్రూ హాయంలో పాలేకర్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1980 మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు లేవు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ విధానాలు నచ్చక అంబేద్కర్ కేబినెట్ వదిలేసి వెళ్లిపోయారు.రాజ్యాంగాన్ని బొంద పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని మండిపడ్డారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)