చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరు: కేశినేని నాని

Published on Thu, 01/18/2024 - 14:30

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్‌ విగ్రహమని అన్నారు ఎంపీ కేశినేని నాని. అంబేద్కర్‌ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరంటూ నాని వార్నింగ్‌ ఇచ్చారు. 

కాగా, కేశినేని నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్‌ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్‌. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్‌ ఆశించారు. సీఎం జగన్‌ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారు. అంటరానితనం, కుల వివక్షపైన అంబేద్కర్‌ పోరాటం చేశారు. పేదలను ఉన్నత స్థాయితో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్‌.

ఆరోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారు. సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడి బొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. అంబేద్కర్‌ విగ్రహంపై రాజకీయాలు చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే మీరు తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

ఇదే సమయంలో కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఈ సందర్బంగా ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని సెటైరికల్‌ పంచ్‌ విసిరారు. అలాగే, రేపు ఎన్నికల బాక్స్‌లు తెరిచాక 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)