Breaking News

AP: నన్ను గొట్టంగాడన్నా భరించా: కేశినేని నాని

Published on Wed, 01/03/2024 - 20:27

ఎన్టీఆర్‌, సాక్షి: పార్టీ పొలిట్‌బ్యూరోలో ఉన్న ఓ వ్యక్తి తనను గొట్టంగాడని అన్నా భరించానని, పార్టీ కోసమే ఓపికపడుతున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గతంలోనూ తాను చాలా అవమానాలు పడ్డానన్నారు. తిరువూరు నియోజకవర్గంలో బుధవారం టీడీపీ సమన్వయ సమావేశంలో గొడవ తర్వాత నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ మీటింగ్‌ జరిగిన ప్రదేశాన్ని ఆ పార్టీ నాయకులు పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేశారు.  ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ నాని ఆవేదన వ్యక్తం చేశారు.  

‘విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పుతీసుకుని కొడతా అన్నాడు. క్యారెక్టర్ లెస్ ఫెలో అన్న ఆ వ్యక్తి  మాటలపైనా పార్టీ నుంచి కనీసం ఎవరూ స్పందించలేదు. నన్ను అవమానించినా పార్టీ కోసం భరించా. నేను ఏరోజూ పార్టీలో వర్గాలను ప్రోత్సహించలేదు. ఏడాదిన్నర నుంచి పార్టీలో కుంపటి నడుస్తోంది...ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి సంఘర్షణలు జరుగుతాయనే నేను పార్టీ కార్యకమాలకు దూరంగా ఉంటున్నా.

తిరువూరు టీడీపీ ఇంఛార్జ్‌ శావల దేవదత్  పూజకు పనికిరాని పువ్వు.  గతంలోనే చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పా. కేశినేని చిన్నికి పార్టీకి ఏం సంబంధం. అతనేమైనా పార్టీలో ఎంపీనా... ఎమ్మెల్యేనా. తిరువూరు ఇంఛార్జ్‌ పార్టీలో క్యాడర్ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. అందుకే మా క్యాడర్ నుంచి రియాక్షన్ వచ్చింది. 

కొంతమంది వ్యక్తులు తమకు బాధ్యతలు అప్పగించారని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. నేను రెండు సార్లు ఎంపీగా గెలిచా. రతన్ టాటా స్థాయి వ్యక్తిని నేను. బెజవాడ పేరు చెడగొట్టకూడదనే ఓపిక పట్టా. రాబోయే పరిణామాలు దేవుడు ..ప్రజలే చూసుకుంటారు’అని నాని అన్నారు.  

స్పందించిన చిన్ని
తిరువూరు ఘటనపై కేశినేని చిన్ని స్పందించారు. తిరువూరు ప్రజలకు క్షమాపణలు చెబుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే.. ఇవాళ జరిగిన తిరువూరు గొడవను అధిష్టానం చూసుకుంటుందని అన్నారాయన.

ఇదీచదవండి..రణరంగంగా నాని వర్సెస్‌ చిన్ని 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)