Breaking News

క్యాష్‌ కొట్టు.. టికెట్‌ పట్టు 

Published on Mon, 04/01/2024 - 03:25

ఆటోనగర్‌(విజయవాడ తూర్పు): పెద్దమొత్తంలో ఎవరు డబ్బు ముట్టచెబితే వారికే చంద్రబాబు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌లు కేటాయిస్తున్నారని విజయవాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌ (నాని) ఆరోపించారు. క్యాష్‌ కొట్టు.. టికెట్‌ పట్టు అనే సిద్ధాంతాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారని విమర్శించారు. ఆదివారం విజయవాడ 15వ డివిజన్‌ రామలింగేశ్వరనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడ తూర్పునియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ విలేకరులతో మాట్లాడుతూ  చంద్రబాబుకు ధనికులంటేనే ప్రేమని,  పేదలంటే చాలా చులకన భావంతో వ్యవహరిస్తారని అన్నారు. పేదలు పచ్చగా ఉంటే బాబు సహించలేరని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నాడు నందమూరి తారకరామారావు తెలుగుదేశంపార్టీని స్థాపించారని, ఆ పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు సప్త సముద్రాల్లో కలిపేశారని మండిపడ్డారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి టిప్పర్‌ డ్రైవర్‌కు అసెంబ్లీ టికెట్‌ కేటాయిస్తే దానిపై పబ్లిక్‌ మీటింగ్‌లో హేళనగా మాట్లాడారని దుయ్యబట్టారు. దీంతో పేదలు ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉండకూడదన్న బాబు నైజం మరోసారి బయటపడిందన్నారు. నాడు ఎన్‌టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించి ఆంధ్రా నుంచి ఢిల్లీ వరకు లారీలపై జెండాలు కట్టుకొని ప్రచారం చేసింది లారీ యజమానులేనని ఆయన గుర్తుచేశారు. 

మోదీతో చంద్రబాబు  పొత్తు దేని కోసం... 
నరేంద్ర మోధీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమా.. రైల్వేజోన్‌ కోసమా.. లేదా రాజధానికి రూ.లక్ష కోట్లు తీసుకురావడానికా.. కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తీసుకురావడానికా, చంద్రబాబు మీద ఉన్న కేసులను మాఫీ చేయడానికా అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాలని నిలదీశారు.

 సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి రూ.2.66 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రజా సంక్షేమానికి గతంలో ఎవరూ ఇంతపెద్ద మొత్తంలో ఖర్చుచేయలేదన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)