Breaking News

‘చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమన్నారు’

Published on Mon, 12/25/2023 - 13:57

సాక్షి,హైదరాబాద్‌: తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే  కేటీఆర్ చెప్పారని ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీ గడ్డం రంజిత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని అన్నారు.

చేవెళ్ల పార్లమెంట్‌లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుండి కాంగ్రెస్, బీజెపి అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్‌.. విషయం ఏంటంటే?

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)