Breaking News

మద్యం నిషేధించాలని వినతి..బీజేపీ ఎమ్మెల్యే సమాధానం విని మహిళ షాక్‌!

Published on Tue, 04/04/2023 - 15:28

భోపాల్‌: మద్యానికి బానిసలైన మగవారివల్ల ఆడవాళ్ల జీవితాలు తలకిందులు అవుతున్నాయని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసింది ఓ గృహిణి. తమ గ్రామంలో మద్యపానంపై నిషేధం విధించాలని కోరింది. 

మొరెనా జిల్లా సంకారా గ్రామానికి చెందిన ఈ మహిళ ఫిర్యాదుకు బీజేపీ ఎమ్మెల్యే సుబేదార్ సింగ్‌ రాజోధా ఇచ్చిన సమాధానం విని ఆమె నివ్వెరపోయింది. స్వయంగా లిక్కర్ కాంట్రాక్టర్ అయిన తాను మద్యాన్ని నిషేధించాలని ఎలా చెప్పగలను అని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో  ఆ మహిళకు ఏం చేయాలో పాలుపోలేదు.

ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేతో మహిళ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ థోమర్‌కు ఈయన అత్యంత సన్నిహితుడని పేరుంది. దీంతో సుబేదార్ సింగ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఫైర్ అయింది. 

హస్తంపార్టీ అధికార ప్రతినిధి ప్రతాప్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ.. శివరాజ్ సింగ్ చౌహన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈయన సర్కార్ రాష్ట్రాన్ని మద్యంలో ముంచెత్తిందని ధ్వజమెత్తారు. లిక్కర్‌ను  అక్రమంగా గ్రామాలకు సరఫరా చేసి ఊర్లలో ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే లిక్కర్‌ కాంట్రాక్టర్‌ అని  బహిరంగంగా చెబుతున్న అధికార బీజేపీ ఎమ్మెల్యేను చూస్తుంటే ఈ మాఫియాను నడిపిస్తోంది ఎవరో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు.
చదవండి: బీజేపీలో మున్నాబాయ్ MBBSలు ఎందరో? ఆ ఇద్దరు ఎంపీలు కూడా.. : కేటీఆర్‌ సెటైర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)