Breaking News

మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా: బండి సంజయ్‌

Published on Sat, 08/02/2025 - 16:33

కరీంనగర్‌: తనను మంత్రి పదవి నుంచి విముక్తి కల్పించాలంటూ తాను అధిష్టానాన్ని కోరినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పందించారు.  అవన్నీ అవాస్తవమని బండి సంజయ్‌ ఖండించారు. మంత్రి పదవి తనకు వద్దని గానీ, కావాలని గానీ తాను అధిష్టానానికి చెప్పలేదన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ‘క్రమశిక్షణ గల బీజేపీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలాంటింది కాదు బీజేపీ. నాకు మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నేను నిర్వహిస్తా’ అని తెలిపారు.

రైతును రారాజున చేయడమే మోదీ లక్ష్యం.. 
చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానమంత్రి కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్‌.. పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రై‘తును రారాజును చేయడమే మోదీ లక్ష్యం. 11 ఏళ్లలో రైతుల కోసం రూ. 71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మోదీది. రైతులు ఎరువుల కోసమే సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేశాం. 

కనీస మద్దతు ధర అందించేందుకు 16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు చేసింది మోదీ సర్కారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల 69 వేల 561 కోట్లు జమ చేశాం. టెన్త్ బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా ’ అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.   

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు