Breaking News

‘కేసీఆర్‌ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తా’.. సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు 

Published on Wed, 07/12/2023 - 14:36

సాక్షి, యాదగిరిగుట్ట: ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే తెలంగాణలో ఎన్నికల హీట్‌ పెరిగింది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలోని నేతలు సీట్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో కొందరికి ఇప్పటికే సీట్ల కేటాయింపు జరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 

మరోవైపు.. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌ మహంకాళి దేవాలయంలో తలసాని విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో తలసాని మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లో ఈ స్థాయికి చేరుకున్నా.. నాకు సీఎం కావాలనే ఆశ లేదు, ఆశకు కూడా ఓ హద్దు ఉండాలి. ఇప్పుడున్న దాంతో సంతోషంగా ఉన్నా’ అని అన్నారు. కాంగ్రెస్‌లో గిరిజన ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి కావొచ్చనే వ్యాఖ్యలు వచ్చాయని, మీ పార్టీలో బీసీ సీఎం అనే ఆలోచన వస్తే మీరు పోటీలో ముందుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తలసాని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)