Breaking News

ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం

Published on Fri, 10/18/2024 - 09:11

సాక్షి, తాడేపల్లి: వర్క్‌షాప్ సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీలో మరింత జోష్‌ పెరిగింది. ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు సర్కార్‌పై పోరాటానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెడీ అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భదత్రలు అదుపు తప్పగా, బాధితులకు అండగా నిలిచేందుకు ఎక్కడిక్కడ ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి దశలోనూ పార్టీ పటిష్ట నిర్మాణం దిశగా, గ్రామ, బూత్ కమిటీలతో పాటు అనుబంధ విభాగాల ఏర్పాటు చేశారు. ప్రజల కోసం పార్టీ పిలుపునిస్తే ఉవ్వెత్తున స్పందించేలా బలోపేతం చేశారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్‌ జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు.

‘‘మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదంటూ నిన్న(గురువారం) జరిగిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌లో వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

మరోవైపు, చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో చర్చ మొదలైంది.  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మంచిని జనం గుర్తు చేసుకుంటున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: బలంగా ఎదుగుదాం.. పార్టీని పటిష్టంగా నిర్మిద్దాం: వైఎస్‌ జగన్‌

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)