Breaking News

‘మోదీ కా పరివార్‌’ పేరుతో పోస్టర్ల కలకలం

Published on Wed, 03/06/2024 - 14:14

 దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ యువ కాంగ్రెస్‌ పేరుతో విడుదలైన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

సెంట్రల్‌ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీని కించపరుస్తూ ‘మోదీ కా అస్లీ పరివార్‌’ క్యాప్షన్‌ జోడిస్తూ పలువురు ఫోటోలతో కూడిన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ఈ సందర్భంగా.. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, పోస్టర్లను తొలగించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే, ఆ పోస్టర్లలో పబ్లిషర్ పేరు,  వాటిని ఎవరు విడుదల చేశారో తెలియాల్సి ఉందని అన్నారు.  

140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమే  
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ‘జన విశ్వాస యాత్ర’ చేపట్టారు. ఆ యాత్రలో ఆయన తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి కుటుంబం లేదని అన్నారు. లాలూ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ దీటుగా బదులిచ్చారు. 140 కోట్ల మంది భారతీయులు నా కుటంబమే అని వ్యాఖ్యానించారు.  

‘మోదీ కా పరివార్‌’
లాలుప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ బీజేపీ అగ్రనేతలు స్పందించారు. ఎక్స్‌. కామ్‌ వేదికగా ఆ పార్టీ అగ్ర నేతలు తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అని పెట్టుకున్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)