ఈసారైనా గెలిచేనా?, ప్రధాని మోదీ హోరు.. బీజేపీ జోరు

Published on Tue, 03/19/2024 - 14:46

సాక్షి, తిరువనంతపురం : కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో బీజేపీ అభిమానులు, మద్దతు దారులు భారీ ఎత్తున తరలించారు.  ఈ రోడ్‌ షోలో బీజేపీ పాలక్కాడ్ లోక్‌సభ అభ్యర్థి సీ కృష్ణకుమార్, పొన్నాని నియోజకవర్గం లోక్‌సభ అభ్యర్థి నివేదత సుబ్రమణియన్‌లు సైతం ప్రధాని వెంటే ఉన్నారు. 

బీజేపీ ఆశలు నెరవేరేనా
కేరళ బీజేపీ ఆశలు పెట్టుకున్న లోక్‌సభ స్థానాల్లో పాలక్కాడ్ ఒకటి. 2019లో లోక్‌ సభ ఎన్నికల్లో పాలక్కాడ్‌ నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.కృష్ణకుమార్‌కు 21 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇది 2014లో సాధించిన ఓట్ల కంటే ఆరు శాతం ఎక్కువ. ఇదే స్థానం నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 'మెట్రో మ్యాన్' ఇ. శ్రీధరన్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ గెలవలేకపోయారు. 2016లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా శోభా సురేంద్రన్‌కు ఓటమి తప్పలేదు.  

మోదీ హోరో..బీజేపీ జోరు
కానీ ఈ సారి లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్‌ ప‍్రజలు బీజేపీకి పట్టం కడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అన్నారు. మోదీ పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ కేరళలో బీజేపీకి విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మరోమారు ఎన్నికల ప్రచారానికి కేరళకు వస్తారని ఆయన పేర్కొన్నారు.

మరోసారి పర్యటన
జనవరి నుండి మోదీ ఐదోసారి కేరళ పర్యటిస్తున్నారు. ప్రధాని వరుస పర్యటనలతో కేరళలో  లోక్‌సభ ఎంపీలు లేని బీజేపీ ఈసారి ‘రెండంకెల’ స్థానాలను గెలుచుకుంటుందని సురేంద్రన్  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)