Breaking News

జూన్‌ 4 తర్వాత జరిగేది ఇదే.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Fri, 05/10/2024 - 14:05

లోక్‌సభ ఎన్నికల తరుణంలో ప్రధాని మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌ పవార్‌), శివసేనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్‌4 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం డూబ్లికేట్‌ ఎన్సీపీ, డూబ్లికేట్‌ శివసేన తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు.

నార్త్‌ మహరాష్ట్ర నందూర్బర్‌ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేరును ప్రస్తావించకుండా ఆయనపై సెటైర్లు వేశారు.

ఓ పెద్దాయన 
40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఓ పెద్దాయన జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదల అనంతరం.. రాజకీయ ఉనికి కోసం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చూస్తున్నారని అన్నారు.

నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో
నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన మనసులో తమ పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ఉందనే కదా దీనర్ధం. కాంగ్రెస్‌లో విలీనం చేసిన రాజకీయ నిరుద్యోగులుగా మిగిలే బదులు.. వచ్చి అజిత్‌ పవర్‌, ఎక్‌నాథ్‌ షిండ్‌తో చేతులు కలిపితే బాగుంటుందని ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.   

ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు
ఇంతకు ముందు ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో శరద్‌ పవార్‌ విలీనంపై మాట్లాడారు. రానున్న సంవత్సరాల్లో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు దగ్గర కానున్నాయి. అంతేకాదు తమ రాజకీయ భవిష్యత్‌ బాగుండాలంటే కాంగ్రెస్‌లోనే విలీనం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ప్రచారంలో శరద్‌ పవార్‌ విలీనం వ్యాఖ్యలపై మోదీ స్పందించినట్లు తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)