Breaking News

ప్రజలకు భూములివ్వడమే సీఎం జగన్‌కు తెలుసు

Published on Sun, 05/05/2024 - 04:24

సాక్షి, అమరావతి: మహానేత వైఎ­స్సార్‌కు, సీఎం జగన్‌కి ప్రజలకు భూములివ్వడమే తెలుసని, చంద్రబాబులా భూములు లాక్కోవడం తెలియదని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆమె శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ అధికారంలో ఉండగా రాజంపేట – రైల్వే కోడూరు మధ్య వందలాది ఎకరాల సొంత భూమిని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి రాసిచ్చేశారని తెలిపారు.

 చంద్రబాబు అమరావతి పేరుతో పేద రైతుల భూములు కొల్లగొట్టారని, గ్రాఫిక్స్‌ చూపించి వారిని మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు రైతుల భూ­ములను చుక్కల భూములంటూ అన్న­దాతలకు చుక్కలు చూపించారన్నారు. రైతు­లు అమ్ముకోకుండా యాక్ట్‌ తెచ్చారన్నారు. సీఎం జగన్‌ ఆ భూములను చుక్కల నుంచి విముక్తి కల్పించి, రైతులకు అందజేశారని తెలిపారు. 2014 –19 మధ్య రాష్ట్రవ్యాప్తంగా భూ కుంభకోణానికి పాల్ప­డిందీ చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. తక్కువ ధరకు భూమి తీసుకుని కోట్ల రూపాయలకు అమ్ముకొన్న ఘనుడు చంద్రబాబేనన్నారు. 

విశాఖలో 100 ఎకరాల భూమి గీతంకి కట్టబెట్టిందీ బాబేనని తెలిపారు. ఇవన్నీ దాచిపెట్టి సీఎం జగన్‌ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పశువులు కూడా ఇంతటి దుర్మార్గానికి ఒడికట్టవని అన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌కు ఇంకా రూల్స్‌ ఫ్రేమ్‌ కాలేదన్నారు. అప్పుడే సీఎం జగన్‌ భూములు లాగేసుకొనేందుకే చట్టం తెచ్చారంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రచారం చేస్తున్నారని అన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)