Breaking News

కాళేశ్వరంపై బాంబ్‌ పేల్చిన కల్వకుంట్ల కవిత

Published on Mon, 09/01/2025 - 16:35

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు వేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్‌ బద్నాం కావడానికి బీఆర్‌ఎస్‌ కీలక నేతలే ముఖ్యకారణమని ఆరోపించారామే. సోమవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..        

‘‘కేసీఆర్‌కు,పార్టీకి నష్టం చేస్తున్న వాళ్ల పేర్లను  మొదటిసారి బయటపెడ్తున్నా. కేసీఆర్‌పై నిందలు ఎవరి వల్ల వస్తున్నాయి. హరీష్‌రావుది మేజర్‌ పాత్ర లేదా? హరీష్‌ రావు,సంతోష్‌ వెనక సీఎం రేవంత్‌ ఉన్నారు. హరీష్‌ రావు, సంతోష్‌ రావులు నా మీద పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు. నా కడుపు రగిలిపోతుంది. మానాన్నకు తిండి మీద,డబ్బు మీద యావ ఉండదు. తరతతరాల తరగని ఆస్తిని కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్‌ పక్కన ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది వల్లే ఇలా జరిగింది.

ఇదంతా హరీష్‌ వల్లే జరిగింది. కేసీఆర్‌కు అవినీతి మరక ఎలా వచ్చిందో చూడాలి. కేసీఆర్‌ మీద విచారణ తర్వాత బీఆర్‌ఎస్‌ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. నష్టం జరిగినా సరే నేను ఇలాగే మాట్లాడతా.  మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు మరక అంటడానికి ఇద్దరు, ముగ్గురే కారణం.  

హరీష్‌రావు,సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌పై అవినీతి మరక. ఇలాంటి వారిని ఎందుకు భరించాలి. కేసీఆర్‌కు అవినీతి మరక ఇలాంటివాళ్ల వల్లనే వచ్చింది. కేసీఆర్‌ మీద విచారణ అంటే తెలంగాణ బంద్‌కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు?.ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఇలా ఉండటం ఏంటి?.కేసీఆర్‌పై విచారణ వేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత?.కేసీఆర్‌కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఎందుకండి?’.

వీళ్లు సొంత వనరులు,ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారు. దమ్ముంటే హరీష్‌రావు,సంతోష్‌రావులపై చర్యలు తీసుకోండి.ఇరిగేషన్‌ శాఖ అధికారుల వద్ద వందలకోట్లు దొరికాయి. ఆ అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి. ఎవరో ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాదు. పిచ్చివాగుడు వాగితే తోలుతీస్తా. కాంప్రమైజ్‌ అయ్యే ప్రస్తక్తిలేదు. పార్టీ ఓటమికి కారణం కేసీఆర్‌ వెంట ఉన్నవాళ్లే’ అని ఆవేశంతో మాట్లాడారు.

MLC Kavitha: మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు.. కడుపు రగిలిపోతోంది

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)