Breaking News

కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్‌ బయలుదేరిన కవిత..

Published on Wed, 08/28/2024 - 08:10

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయలుదేరారు. కేటీఆర్‌, భర్త అనిత్‌, కుటుంబ సభ్యులతో కలిసి కవిత విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. నా పోరాటం కొనసాగుతుంది. నిజం కచ్చితంగా గెలుస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకోవాల్సి ఉంది. సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యావాదాలు. జై తెలంగాణ’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

నేడు 500 కార్లతో భారీ ర్యాలీ 
కవిత జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సందడి నెలకొంది.

జైలు నుంచి విడుదల..
ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరుచేసింది. ఈ క్రమంలో తీహార్‌ జైలు నుంచి విడుదల అనంతరం కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్‌ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్‌మెంట్‌తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ కు కవిత

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)