Breaking News

ఓటమిని అంగీకరించే స్థితిలో కేటీఆర్‌ లేడు: జీవన్‌ రెడ్డి సెటైర్లు

Published on Fri, 01/12/2024 - 12:47

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేతలపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. బీఆర్‌ఎస్‌ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్‌ లేడు అంటూ కామెంట్స్‌ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. 

కాగా, జీవన్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదు. మిషన్ భగీరథ పెద్ద స్కాం. కాళేశ్వరం రీ-డిజైన్ పెద్ద బోగస్. కేవలం కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ను ఎస్సీ డెవల్మెంట్ ఫండ్‌గా మార్చి.. నిధులను మళ్లించింది. నిధుల దారి మళ్లింపును చర్చకు రాకుండా చేసేందుకు దళితబంధును తెరపైకి తెచ్చారు.

గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. అందుకే వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేశారు. బీఆర్ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లెంలా కాచుకుని ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)