Breaking News

ఎన్డీయేకి దగ్గరయ్యేందుకు కేటీఆర్‌ ప్రయత్నాలు: అద్దంకి దయాకర్‌

Published on Thu, 04/24/2025 - 13:47

సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌. చంద్రబాబు మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ డైరెక్షన్‌లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి కేటీఆర్ వల వేస్తున్నారు. ఎన్డీయే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలి. కనీసం కేసీఆర్ కుటుంబం నుండి కాకుండా వేరే వెలమనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేయగలరా?. కేటీఆర్‌కి దమ్ముంటే పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలి.

అధ్యక్ష పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తెచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు?. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో ఆయనకే తెలియాలి. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకా? టీఆర్ఎస్ పార్టీకా?. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి రెండేళ్లు అయింది. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ కొడుకు విలన్. బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అయితే పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా?.

కమలం పువ్వు కాడికి గులాబీ పువ్వును అంటగడుతున్నారు. చంద్రబాబు, మేము వేరువేరు కాదని కేటీఆర్ అంటున్నాడు. చంద్రబాబుకి మాకు సారూప్యత ఉందని కేటీఆర్ చెబుతున్నారు. హెచ్‌సీయూ విషయంలో బీఆర్ఎస్ హ్యాండిల్స్ నుండి ఫోటోలు ఎందుకు డిలీట్ చేస్తున్నారో చెప్పాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)