Breaking News

‘చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు’

Published on Thu, 06/12/2025 - 20:19

తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, హామీలను అమలు చేయాలనే గొంతులను మాత్రం ఏడాదిది నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, జూన్‌ 12) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్‌..  కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు. 

‘తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నామని అబద్దం చెబుతున్నారు.రికార్డ్స్ ప్రకారం దాదాపు 87 లక్షల మందికి తల్లికి వందనం అమలు చేయాలి. పదమూడు వేల కోట్ల రూపాయిలు తల్లికి వందనం పథకానికి కావాలి. కానీ తల్లులను చంద్రబాబు మోసం చేశారు. తల్లికి వందనం కాదు తల్లికి వంచనగా మార్చారు. 

ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మోసం అని తెలియదా?, దీనిపై ప్రజలు ప్రశ్నించకూడదా?, దమ్ము దైర్యం ఉంటే ఈ ఏడాది కాలంలో మీరు అమలు చేసిన పథకాలను ముద్రించి ప్రజల ముందు ఉంచగలరా చంద్రబాబూ?, ప్రజా స్వామ్య విలువలు పాటించకపోతే ఇక ఈ ప్రభుత్వం ఎందుకు?, ఒక పథకాన్ని అమలు చేయడంలో ఇంత వంచనా?, ఇవ్వాల్సిన సొమ్ములో రెండు వేలు కట్ చేసి, తల్లికి వందనం సంపూర్ణం అని ఎలా చెబుతారు?, P4 అనేది ప్రణాళిక లేని కార్యక్రమం. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు. 

దళితుల కుటుంబాలను జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శిస్తే మీకు కడుపు మంట ఎందుకు?, రాష్ట్రాన్ని రాజకీయ ఖైదీలకు నిలయంగా మార్చారు.శవాల దిబ్బగా రాష్ట్రాన్ని మార్చాలి అనుకుంటున్నారా?, ప్రభుత్వంపై ఏడాదిలోనే ఇంతగా రైతులు తిరగ బడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.ప్రభుత్వం పై రైతులు తిరగబడితే రౌడి లా కనపడుతున్నారా?, రైతులను రౌడీలంటూ అగౌరవపరుస్తారా?, ఇదేనా మీ సంస్కారం?’ అని విమర్శించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)