Breaking News

అసలు కథ ముందుంది.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్‌ కామెంట్స్‌

Published on Wed, 08/30/2023 - 15:59

సాక్షి, జనగామ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌ ముందుగానే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం రాష్ట్రంలో టికెట్ల విషయం కాక రేపుతోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. బీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కని ఆశావహులు అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. మరికొందరు నేతలు ఏకంగా పార్టీ నుంచి జంప్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ లభించని ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. 

ఝలక్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు..
తాజాగా రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. టికెట్‌ రాకపోయినా నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఎవరూ రారు.. ఏమీ జరగదు. నా పని ఇప్పుడే అయిపోందని భావించకూడదు అంటూ కీలక కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన ఏం చేస్తారనే టెన్షన్‌ బీఆర్‌ఎస్‌ నేతల్లో నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాజయ్య బుధవారం లింగాలఘనపురం మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. అయితే, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్‌కు చెందిన స్థానిక నేతలు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో నేతల తీరుపై రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

చూస్తూ ఊరుకుంటామా..
ఇక, అంతకుముందు కూడా రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో అసంతృప్తితో ఉన్న రాజయ్య..  ఆరు నూరైనా ప్రజాక్షేత్రంలో ఉంటానని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్‌ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించడంపై పరోక్షంగా రాజయ్య మనోవేదన చెందుతున్నారు. ఈ సందర్భగా రాజయ్య మాట్లాడుతూ.. భూమి కొని మొట్లు కొట్టి దుక్కి దున్ని నారు పోసి కలుపుతీసి, పంట పండించి కుప్ప పోశాక కుప్ప మీద వచ్చి ఎవరో  కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..  నవ్వుతూ నోరు కొట్టుకున్నారు. దేవుడున్నాడు, దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు.. రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు.‌ ప్రజల కోసమే నేనున్నా, ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని తెలిపారు. 

ఇది కూడా చదవండి: సాగర్‌ బీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్‌

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు