Breaking News

‘ఆ ఇద్దరు ఒకటైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా?’

Published on Sun, 07/19/2026 - 15:45

సాక్షి, హైదరాబాద్‌: మరోసారి బీజేపీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఒక మంచి ఆలోచనతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈటల రాజేందర్, బండి సంజయ్‌ని ఒక చోట కూర్చోబెట్టారు అభయ్ పాటిల్.. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒకటైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా..?. ఆ నేతల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు..అయినా ఒకటిగానే ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి?’’ అంటూ రాజాసింగ్‌ ప్రశ్నించారు.

‘‘గతంలో చాలామంది మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిచారు. వాళ్ల దగ్గరకి వెళ్లి వాళ్ల సమస్యలు, డివిజన్ సమస్యలు, బూత్ కార్యకర్తల సమస్యలు అడుగుతున్నారా?. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగే మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు మేయర్లు గెలుస్తామని చెపుతున్నారు. ఆ మూడు కార్పొరేషన్‌లలో బీజేపీ బలంగా ఉందని తెలుసుకున్నారా? సమావేశాల్లో మేము చాలా బలంగా ఉన్నామని బీజేపీ నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. మూడు కార్పొరేషన్ మేయర్లు గెలవడం కాదు.. ఒకటి కూడా కాదు.. ఒక కార్పొరేషన్‌లోని సగం సీట్లు గెలిచి చూపించండి’’ అంటూ రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.

‘‘బీజేపీ పని తీరు నాకు అట్లా కనిపిస్తుంది.. కొంత మందికి అధ్యక్ష పదవి రావొద్దని.. ఆ పదవిలో కొంత మంది రాంచందర్‌రావుని కూర్చోపెట్టారు. రాంచందర్ రావు చేతులు కట్టేసి పని చేయమంటే ఎట్లా?. రాంచందర్‌రావు ఎంత బాధలో ఉన్నారో నాకు తెలుసు. ఒకే ఒక్క వ్యక్తి మేము చెప్పినట్లే పని చేయాలని చెపితే ఎట్లా చేస్తారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిస్తే మీకే పేరు వస్తుంది. ఉన్న సీట్లలో తగ్గితే మీపైనే రాళ్లు వేస్తారు. మీ చేతులు కట్టేసిన వాళ్ళ గురించి కేంద్ర పెద్దలకు చెప్పండి. మీరు ఫ్రీ హ్యాండ్‌గా పని చేస్తేనే మంచి పలితాలు వస్తాయి.

..అధిష్టానం, పార్టీలో ఉన్న పెద్దలకి నా విజ్ఞప్తి.. ఒక వ్యక్తి కోసం ఎప్పడు ఆలోచన చేయకండి. నాలాంటి వాళ్లు పార్టీలోకి వచ్చి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ భిక్షం నాకు వద్దు. ఇద్దరు ముగ్గురు ఇగోల వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో హైకమాండ్‌కి చెప్పండి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని బీజేపీ శ్రేణులు, ప్రజలు కోరుకుంటున్నారు. కాషాయ రాజ్యం కోసం చాలా మంది కలలు కంటున్నారు. ఆ కలలని నిజం చేయండి’’  అంటూ రాజాసింగ్‌ చెప్పుకొచ్చారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)