Breaking News

బీఆర్‌ఎస్‌ను అందుకే వీడుతున్నా.. దానం సంచలన వ్యాఖ్యలు

Published on Thu, 01/29/2026 - 10:43

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో తనను విస్మరించిన కారణంగానే పార్టీని వదుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘పోస్టుల కోసం పదవుల కోసం నేను ఎక్కడికిపోలేదు. విస్మరించారు కాబట్టే  నేను వదలాల్సి వచ్చింది. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు నాకు సహకరిస్తారు. నా ప్రజలపై ఆధారపడే నా నిర్ణయాలు ఉంటాయి. ప్రజల ఆశీర్వాదంతోనే ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. ఖైరతాబాద్ ప్రజలే నాకు బలం. సేవ చేయాలనే ఉద్దేశం తప్ప పదవుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు.

ఎంతవరకు అయితే అంత వరకు పోరాటం చేస్తాను. స్పీకర్ నోటీసులు నాకు ఇంకా అందలేదు. పిటిషనర్‌కి నోటీసులు అంది ఉండవచ్చు. ఉన్న విషయాలను సమర్థవంతం చేసుకోవడానికి లీగల్ అంశాలను పరిశీలిస్తున్నాను. స్పీకర్ ఏం అడుగుతారో దానికి సమాధానం చెప్తాం. స్పీకర్ ప్రశ్నలను బట్టి నా సమాధానాలు ఉంటాయి. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నాకు చెప్పలేదు. మా అడ్వకేట్‌ స్పీకర్‌కు లేఖలో ఏం రాశారో తెలియదు. బీఆర్‌ఎస్‌ నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. వాళ్లు తీసుకునే యాక్షన్‌ బట్టి నా రియాక్షన్‌ ఉంటుంది. ఎన్నికలంటే నేనేమీ భయపడను’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)