Breaking News

విద్యాసాగర్‌ రావును బీజేపీ బలి పశువును చేస్తోంది: దానం నాగేందర్‌

Published on Sat, 06/17/2023 - 14:48

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు రాష్ట్రానికి ఇచ్చిన వివరాలను ‘రిపోర్టు టు పీపుల్‌ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పందించారు. 

ఈ సందర్బంగా దానం నాగేందర్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్‌ రెడ్డి వాఖ్యల్ని తీవ్రంగా  ఖండిస్తున్నాం. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రావాల్సిన నిధులు ఇప్పటివరకు కేంద్రం ఇవ్వలేదు. ఎంపీగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలి. మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదా?. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం అడ్డుకుంది. 

హైదరాబాద్‌, తెలంగాణ నుంచి వస్తున్న రిసోర్సెస్‌ వల్లనే రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. దాని ఆధారంగానే అభివృద్ధి జరుగుతోంది. కిషన్‌ రెడ్డి ఈ మాయ మాటలు పక్కన పెట్టాలి. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఇదే సమయంలో బీజేపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీ. విద్యాసాగర్‌ రావు హైదరాబాద్‌ రెండో రాజధాని అంటూ చేసిన కామెంట్స్‌పై కూడా దానం స్పందించారు. తెలంగాణకు రెండో రాజధాని అంటూ బీజేపీ మళ్లీ మాటలు చేప్తోంది. హైదరాబాద్‌ ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి కామెంట్స్‌ చేస్తున్నారు. విద్యాసాగర్‌ను బలిపశువును చేయడానికే బీజేపీ ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇస్తోంది. 

ఇది కూడా చదవండి: రాహుల్‌తో జూమ్‌ మీటింగ్‌.. 22న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)