Breaking News

కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌.. చెన్నమనేనికి కీలక పదవి

Published on Sat, 08/26/2023 - 07:48

సాక్షి, వేములవాడ: తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశావహులు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి టికెట్‌ దక్కని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబుకు కేసీఆర్‌ ​కీలక పదవి ఇచ్చారు. 

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించింది. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్‌  చెన్నమనేని రమేష్‌ బాబును ఈ పదవిలో నియమిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్టు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని సీఎంవో తెలిపింది.

ఇదిలా ఉండగా.. చెన్నమనేనిని కాదని చల్మెడ లక్ష్మీనర్సింహారావును టికెట్‌ ప్రకటించడంతో వేములవాడ బీఆర్‌ఎస్‌లో అలజడి చోటుచేసుకుంది. దీంతో చెన్నమనేని మద్దతుదారులు నిరాశకు గురయ్యారు. అలాగే, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన రమేశ్ బాబు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో రాజకీయాలు ప్రజల కోసం తప్ప పదవుల కోసం చేయొద్దంటూ తన తండ్రి రాజేశ్వర్‌రావు మాటలను గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్‌.. చెన్నమనేనిని కీలక పదవి ఇచ్చారు. కేసీఆర్‌ నిర్ణయంతో వేములవాడలో చల్మెడ ప్రచారానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. 

ఇది కూడా చదవండి: తుమ్మల ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్‌

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)