Breaking News

అసెంబ్లీలో అక్బరుద్దీన్‌ ఓవైసీ సంచలన ప్రకటన

Published on Sat, 02/04/2023 - 17:22

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో సభకు వస్తామని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్‌  మాట్లాడుతూ ప్రస్తుతం శాసనసభలో తాము ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నామనే ప్రస్తావన, ఇతరులు ఎత్తిచూపడం కొంత బాధ కలిగిస్తోందన్నారు.

ఏడుగురు సభ్యులున్న పార్టీకి సభలో గంట సమయం ఎందుకు కేటాయించాలంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అందువల్ల ఈ విషయమై ఎంఐఎం అధ్యక్షుడితో చర్చిస్తామని, కనీసం 50 సీట్లలో పోటీచేసి 15 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తాము రాజకీయంగా బీఆర్‌ఎస్‌తోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రసంగంలో తనను ఉద్దేశించి ప్రతి­పక్ష నేత అని సంబోధించడంపై సభాపతి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేత అనేది లేదని ఆ తర్వాత స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

12% రిజర్వేషన్ల హామీ అమలు చేయాలి..
గతంలో హామీ ఇచ్చిన విధంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పన దిశగా చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త రిక్రూట్‌మెంట్‌లో 4 శాతం రిజర్వేషన్లు పాటించడం లేదని, రోస్టర్‌ ప్రకారం 3 శాతమే వర్తింపజేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ, మెట్రో రైలు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి అంశాలపై మంత్రులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులకు డీఏ 6.8 శాతం చెల్లింపుతోపాటు కొత్త పీఆర్‌సీని ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు.

రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అక్బరుద్దీన్‌ సూచనలపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ప్రతిపక్ష నేత అని ప్రస్తావించానే తప్ప తనకు అంత కచ్చితంగా తెలియదన్నారు. పాతబస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సోమవారం (6న) అసెంబ్లీ ఆవరణలోనే సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏను ఇటీవల ప్రకటించిందని, పీఆర్‌సీ ఏర్పాటు విషయం ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి దిద్దుబాటు చర్యలు చేపడతామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.  


చదవండి: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు: అసెంబ్లీలో కేటీఆర్‌ ఫైర్‌

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)