Breaking News

సుప్రీం తీర్పుతో టీడీపీలో గుబులు

Published on Fri, 05/05/2023 - 09:20

కర్నూలు(హాస్పిటల్‌)/బొమ్మలసత్రం: అమరావతి భూ కుంభకోణం విచారణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టీడీపీ నాయకుల్లో గుబులు మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.12.90కోట్లతో నిర్మించిన డయాగ్నోస్టిక్‌ బ్లాక్, రూ.4.50కోట్లతో నిర్మించిన ఉమెన్స్‌ పీజీ హాస్టల్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలిసి ఆమె గురువారం ప్రారంభించారు. రూ.120 కోట్లతో నిర్మిస్తున్న స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ అమరావతి భూకుంభకోణం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో అవినీతి తదితర వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగింపునకు వీలుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వారి అవినీతి బాగోతం అంతా బయటకు వస్తుందనే ఆందోళన స్పష్టంగా తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, జనం మద్దతు టీడీపీకి దక్కే పరిస్థితి లేదని, ఈ విషయం అర్థమయ్యే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

నాలుగు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు
ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం జగన్‌ ఏకంగా రూ.8,500 కోట్లతో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి రజిని తెలిపారు. వీటిలో ఐదు మెడికల్‌ కళాశాలలు ఈ ఏడాది నుంచే ప్రారంభం కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ క్రమంలో నాలుగు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుమతులు కూడా వచ్చాయన్నారు. నంద్యాల, ఏ­లూ­రు, మచిలిపట్నం, విజయనగరంలో ఈ వి­ద్యా సం­వత్సరం నుంచే ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రా­రంభమవుతాయని తెలిపారు. రాజమహేంద్ర­వరం మెడికల్‌ కళాశాలకు కూడా త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా నంద్యా­ల మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణ పనులను మం­త్రులు పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కర్నూలు ఎంపీ డాక్టర్‌ ఎస్‌.సంజీవకుమార్, ఎమ్మెల్యే­లు కా­ట­సాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, శి­ల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, ఏ­పీ­ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, అ­కడ­మిక్‌ డీఎంఈ డాక్టర్‌ సత్యవరప్రసాద్‌ పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)