Breaking News

‘కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం’

Published on Tue, 07/21/2026 - 22:02

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాహభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన జాతి.. తెలంగాణ ఇచ్చిన జాతి అని స్పష్టం చేశారు. ఇచ్చిన తెలంగాణ‌ను అంద‌రూ మెచ్చె తెలంగాణ‌గా తీర్చిదిద్దుతున్న జాతి తమదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజ‌ల‌కు విశ్వాసంగా ఉన్న జాతి.. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి తమేదనని చెప్పారు. తెలంగాణను దోచుకున్న రాబందులను త‌రిమికొట్టడమేగాక, తెలంగాణ భ‌విష్యత్తు త‌రాల‌కు బాస‌ట‌గా నిలిచామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ..

ఎక్కుపెట్టిన తుఫాకికి ఎదురుగా నిల‌బ‌డ్డ ఉద్యమ‌కారుల వెనుక దాక్కున పిరికిపంద‌ల జాతి మీదని మంత్రి అన్నారు. రాష్ట్రం కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంట‌ల మీద చ‌లికాచుకున్నది మీరని గుర్తు చేశారు. తెలంగాణ అమ‌ర‌వీరుల‌ స‌మాధుల మీద‌ గ‌డీలు క‌ట్టుకున్న నికృష్టపు జాతి ఎవరిదో ప్రజలకు తెలుసని వివరించారు.

యువ‌కుల బ‌లిదానాల మీద కూర్చొని పంచభక్ష్య పరమాన్నాలు తిన్నడమేకాకుండా..తెలంగాణ సంప‌ద‌ను అన‌కొండ‌లా అమాంతం మింగేశారని..అధికారాన్ని అడ్డం పెట్టుకున్ని అహంకారం చూపించినందుకే..తెలంగాణ ప్రజ‌ల చైత‌న్యం ముందు చెత్త కుప్పలో ప‌డ్డ విషయాన్ని కేటీఆర్ మరిచిపోవొద్దని మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్‌ ఇచ్చారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)