Breaking News

నా హత్యకు ప్రయత్నాలు.. మంత్రి వాకిటి సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 02/28/2026 - 11:15

సాక్షి, నారాయణపేట : తెలంగాణలో మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు తన మీద వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి వాకిటి శ్రీహరి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘దేవుడు మనకు మరణం ఎ‍ప్పుడు నిర్ణయిస్తే అప్పుడే చనిపోతాం. నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. చావుకు నేను భయపడను. అవమానాలు పడినందుకే రాజకీయాల్లో వచ్చాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం పని చేసుకుంటూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాడుపడుతున్నాను. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు నా మీద వేశారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మక్తల్‌ మున్సిపల్‌లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.

72 సంవత్సరాల్లు 14 మంది ఎమ్మెల్యేలు మక్తల్‌ నియోజకవర్గానికి తెచ్చింది రూ.296 కోట్లు మాత్రమే. రెండేళ్లలో మాత్రం రూ. 1035 కోట్లు తెచ్చాను. 
ప్రశ్నించడం మంచిదే కానీ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను అవమానించవద్దు. అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారు, అయినా ముందుకు పోతున్నాం. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. ఎన్ని అవమానాలు చేసినా నేను భయపడను, బెదరను, అభివృద్ధి కోసమే పనిచేస్తాను. 
ఈ ప్రాంతం అనేక రంగాల్లో ఆర్ధికంగా ఎదగలేని పరిస్థితి నుంచి అభివృద్ధి వైపు ఈ ప్రాంతాన్ని నడిపిస్తాను. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌లో అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తాను’ అని అన్నారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)