Breaking News

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్‌

Published on Tue, 07/23/2024 - 15:49

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌  విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. 

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్‌కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.

‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్‌లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక  58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాం

పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం

'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్‌  రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.

రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)